నాన్న
చరా చర విశ్వ అధినేత
జగత్ రక్షణకై
...
నెరపిన విలక్షణ సృష్టి
పవిత్ర పితృ దేవ స్వరూపం
మూర్తీభవించిన ఆ సంపూర్ణ విగ్రహం
అమోఘ అనుభవ విజ్ఞాన సారం
ప్రశాంత సుందర దివ్య వదనం
అపూర్వ తేజో విరాజితం
శ్వేత వర్ణ మెరుపుల నయనం
మమతా భావ సామ్రాజ్య నిలయం
అఖండ సంద్రపు గంభీర హృదయం
ప్రేమ హిమాలయ సమన్వితం
ఆ అభయ హస్త నీడన జీవన యానం
నిశాంత వేళల శశాంక కాంతిలో
అపూర్వ తాజమహల్ వీక్షణం
అందమైన ఆ అనుభవం
అనుభవించమని ప్రసాదించిన
సృష్టికర్తకు జేజేలు
No comments:
Post a Comment