Sunday, March 10, 2013



          
శ్రీ రామలింగేశ్వరా  స్వామి శ్రీ రామలింగేశ్వరా
శ్రీ రామలింగేశ్వరా  స్వామి శ్రీ రామలింగేశ్వరా

నీ నామ భజనం సర్వ పాప హరణం
నీ పాద శరణం సకల భాగ్య ప్రదానం

కన్నప్పకు నీవు కనులను ఇచ్చావు
   వర్గ త్రయ భేదాలు లేవని చెప్పావు

పాసుపతముతో అర్జునుని  దీవించావు
ధర్మానికి అండగా నీవున్నావు

అసురులపైనా  కరుణను కురిపించావు
దారి తప్పితే మాత్రం శిక్షించావు

మహేశ్వరా ఓ మహేశ్వరా
మహేశ్వర ఓ మహేశ్వరా

శరణు  జొ చ్చినాము  మమ్ము కాపాడవా
శరణు  జోచ్చినాము  మమ్ము కరుణించవా

నున్న గ్రామాన  నీవు వేంచేసినావు
సకల భోగ  భాగ్యాలను ప్రసాదించినావు

సర్వదా నీకు మేము భక్తులమే గాదా
ఎల్ల  వేళల మాకు శుభములు కల్పించవా 

మహేశ్వరా ఓ మహేశ్వరా
మహేశ్వర ఓ మహేశ్వరా
                                   -- సరికొండ సతీష్  ----

No comments:

Post a Comment