భగవతుణ్ణి భక్తి మార్గం లో ఆరాధించ టానికి తొమ్మిది రకాలైన విధానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ లేక కొన్ని పాటించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు.
- శ్రవణం - దేవుని గురించి వినుట
- కీర్తనం - అన్నమయ్య వలె , త్యాగయ్య వలె దేవుని కీర్తి పాడుట
- దైవ స్మరణ - నారదుని వలె నిరంతరం నామం స్మరించుట
- పాద సేవ - గరుడుని వలె స్వామి సేవ చేయటం
- అర్చన - ఆవాహనము , ఆసనం, అర్ఘ్యం, పాద్యము , స్నానము, వస్త్రము, అలంకారం, పూజ, ధూపం, దీపం, నైవేద్యము, నీరాజనం వంటి పద హారు చర్యలతో అర్చించటం.
- వందనం- త్రికరణ (మనసు, వాక్కు , శరీరం) సుద్ది గా నమస్కరించటం .
- దాస్యం - హనుమంతుని వలె దాస్యం చేయటం
- సఖ్యం - గోపికల వలె అర్జునిని వలె దేవుని తమ సఖుని గా భావించి తనపై భారం వేయటం.
- ఆత్మ నివేదనం - ఆత్మ (తనను తాను) భగవంతుని కి అర్పించి స్వామి సంకల్పం పై కర్మలు చేయటం.